AP Legislative Council Chairman and minister tested Covid-19: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధరణ ప్రజలతోపాటు నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ఏపీ శాసనమండలి చైర్మన్‌కు, మరో మంత్రికి కరోనా సోకింది. మంగళవారం ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (Shariff Mohammed Ahmed) కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అంతేకాకుండా ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శాసనమండలి చైర్మన్ షరీప్‌కు, మంత్రి పెద్దిరెడ్డికి కరోనా సోకడంతో.. వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. Also read: Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..!
ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో ఏపీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకు చెందిన పలువురు ఎమ్మెల్యేల సైతం కరోనా బారిన పడ్డారు. అయితే ఏపీలో నిత్యం పదివేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల పరంగా దేశంలో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. Also read: AGR Dues: సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు ఊరట