తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున గుండోపోటు రావడంతో..ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. వివరాలిలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాలర్ శేషాద్రి. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తిరుమల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి(Dollar Seshadri) గురించి తెలిసే ఉంటుంది. టీటీడీ ప్రత్యేక అధికారిగా ఉన్న పి శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన ఆయనకు ఇవాళ తెల్లవారుజూమున గుండెపోటు వచ్చింది.  ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన కన్నుమూశారు(Dollar Seshadri Died). 


1978 నుంచి శ్రీవారి సేవలోనే ఉన్న డాలర్ శేషాద్రి వాస్తవానికి 2007లో పదవీ విరమణ పొందినా..ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో కొనసాగుతున్నారు. ఎందుకంటే దేవాలయ సాంప్రదాయాలపై, దేవాలయ క్యూలైన్ల నిర్వహణ వ్యవహారాల నిర్వహణపై డాలర్ శేషాద్రికున్న అవగాహన ఎవరికీ లేదు. ఓ సాధారణ గుమాస్తాగా చేరిన ఆయన ఓఎస్‌డీ స్థాయికి ఎదిగారు. డాలర్ శేషాద్రి శ్రీవారి ఆలయంలో పదవీ విరమణ పొంది పదేళ్లైనా..ఇంకా సేవలు కొనసాగిస్తున్నారు. టీటీడీలో 50 ఏళ్ల నుంచి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి , ఉత్సవాలకు సంబంధించి పలు వ్యవహారాలపై ఆయనకు మంచి పట్టుంది. డాలర్ శేషాద్రిపై ఎన్ని ప్రశంసలున్నాయో..అంతే స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి. అయినా టీటీడీపై(TTD)ఆయనకున్న పట్టు, అవగాహన నేపధ్యంలో ఏ ప్రభుత్వం కూడా పక్కనబెట్టలేదు. శేషాద్రి సేవల్ని వినియోగించుకుంటూనే ఉంది.


Also read: ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకింత ప్రమాదకరం, రోగనిరోధకత కూడా పనిచేయదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook