ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకింత ప్రమాదకరం, రోగనిరోధకత కూడా పనిచేయదా

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై భయం గొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. అసలు ఒమిక్రాన్ వైరస్ ఎందుకింత ప్రమాదకరమో ఇప్పుడు పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2021, 07:11 AM IST
  • ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రమాదకర విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా
  • ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకంత ప్రమాదకరం, వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా
  • ఒమిక్రాన్ వేరియంట్ రోగ నిరోధకత నుంచి తప్పించుకుంటుందా
 ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకింత ప్రమాదకరం, రోగనిరోధకత కూడా పనిచేయదా

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై భయం గొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. అసలు ఒమిక్రాన్ వైరస్ ఎందుకింత ప్రమాదకరమో ఇప్పుడు పరిశీలిద్దాం.

నిన్నటి వరకూ ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి(Corona Pandemic) ఇప్పుడు కొత్త రూపం దాల్చుకుంది. కరోనా వైరస్ పూర్తిగా మరోసారి మ్యూటేట్ చెంది కొత్త వేరియంట్‌తో దాడి చేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రపంచాన్ని గజగజలాడించిన డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైందని తేలడంతో ప్రపంచమంతా వణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పిటికే యూరప్ సహా చాలా దేశాల్లో విస్తరించిందని తెలుస్తోంది. వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒమిక్రాన్ వైరస్ ఎంత ప్రమాదకరమో ఎయిర్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరిస్తున్నారు. 

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron)గురించి వివరించారు. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో ఒమిక్రాన్ 30కు పైగా మ్యూటేషన్లు కలిగి ఉందని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోని వేరియంట్లు రోగనిరోధకతను తప్పించుకునే యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయని..ఇది పూర్తిగా ఆందోళన కల్గించే అంశమని చెప్పారు. స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాల్ని రూపొందించేందుకు చాలా వ్యాక్సిన్‌ల పని చేస్తాయని..అందుకే కోవిడ్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని వ్యాక్సిన్లను సమీక్షించాల్సి ఉందన్నారు. 

వ్యాక్సిన్ పనిచేయదా

ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో(Omicron Spike Protein) అనేక మ్యూటేషన్లు ఉన్నందున చాలా రకాల వ్యాక్సిన్లను అధిగించేస్తుందని డాక్టర్ గులేరియా సందేహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30 కంటే ఎక్కువసార్లు మ్యూటేట్ అయినట్టు గుర్తించారు. ఫలితంగా మనిషిలోని రోగనిరోధకత ఎస్కేప్ మెకానిజమ్‌లను(Immunity Escape Mechanism) అభివృద్ధి చేసే సామర్ద్యాన్ని ఇది కలిగి ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో ఉన్న మ్యూటేషన్లు కోవిడ్ వ్యాక్సిన్ సామర్ద్యాన్ని తగ్గించేందుకు దారి తీయవచ్చని గులేరియా చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీన తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర ప్రమాదకరమైందిగా గుర్తించింది. ఈ వేరియంట్ ఇప్పటి వరకూ యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో విస్తరించింది. అదృష్టవశాత్తూ ఇండియాలో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

Also read: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, దేశంలో ఒమిక్రాన్ కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News