YSRCP Teleconference: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి లేకపోవడంతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలు, కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై కలత.. టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చిపడేసిన వైఎస్‌ విజయమ్మ


వైఎస్సార్‌సీపీ అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సోషల్‌ మీడియా టీమ్‌ హెడ్స్‌తో సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో కొద్దిరోజులుగా ప్రధానంగా సోషల్‌ మీడియా వారియర్స్‌, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50-60 మంది సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు' అని గుర్తుచేశారు. ఈ కుట్రలు, దాడులను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. 'కూటమి ప్రభుత్వం చేసే అబద్దపు ప్రచారాన్ని నిజాయితీగా ప్రశ్నించే సోషల్‌ మీడియా వారికి అడ్డంగా మారింది. వారి వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే రాజకీయ కుట్రతో అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా కేసులు పెడుతున్నారు' అని తెలిపారు.

Also Read: Pawan Kalyan: నేను హోంమంత్రి అయితే మరో 'యోగి'ని అవుతా! పవన్‌ కల్యాణ్‌ సంచలనం


 


'సోషల్‌ మీడియా గొంతుకను కాపాడుకోవాలి. చంద్రబాబు మోసాలు ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ.. మనపై చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడుతున్న వారికి అండగా నిలబడాలి. ప్రజలకు సరైన సమాచారం అందాలంటే సోషల్‌ మీడియా ఉంది. వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుండడంతో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది' అని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. నిజం పక్షాన ఉండడంతో వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చెప్పారని తెలిపారు.


'ఎవరూ అధైర్యపడద్దు. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు నిజం తెలియాలి. మనపై జరుగుతున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలి. మన స్వేచ్ఛను హరించే ప్రయత్నాన్ని ఎదుర్కొందాం' సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 'తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఎవరూ భయపడకొండి లీగల్‌ సెల్‌ క్రియాశీలకంగా ఉంది. కేసులు నమోదు కాగానే వెంటనే స్పందించి సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా చేస్తున్న ప్రతిది తిప్పికొడదాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.