Remdesivir injections: రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి
Remdesivir injections: కరోనా చికిత్సలో ఇప్పుడు ప్రదానంగా విన్పిస్తున్న మందు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్. దేశంలో కరోనా ఉధృతి నేపధ్యంలో ఏర్పడ్డ రెమ్‌డెసివిర్ కొరత త్వరలో దూరం కానుంది. ఏపీ కేంద్రంగా ఇంజక్షన్ తయారీ కానుంది.
Remdesivir injections: కరోనా చికిత్సలో ఇప్పుడు ప్రదానంగా విన్పిస్తున్న మందు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్. దేశంలో కరోనా ఉధృతి నేపధ్యంలో ఏర్పడ్డ రెమ్‌డెసివిర్ కొరత త్వరలో దూరం కానుంది. ఏపీ కేంద్రంగా ఇంజక్షన్ తయారీ కానుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. ఆక్సిజన్, బెడ్స్, అత్యవసర మందుల కొరత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు ( Remdesivir injection) డిమాండ్ ఎక్కువైపోయింది. ఈ ఇంజక్షన్ అందుబాటులో లేక కరోనా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ సరఫరాకు కేంద్రబిందువుగా మారింది. అయితే త్వరలో ఈ ఇంజక్షన్ కొరత చాలావరకూ దూరం కానుంది. ఇకపై ఏపీలోని దువ్వాడలో ఉన్న రెడ్డీస్ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ తయారు కానుంది.
దువ్వాడలోని వీఎస్ఈజెడ్ ఆవరణలో రెడ్డీస్ ల్యాబ్ ( Dr reddys labs) యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. యూనిట్ ఏర్పాటుకు రెడ్డీస్ ల్యాబ్‌తో పాటు స్ట్రాక్సీ సంస్థ దరఖాస్తు చేసుకోగా రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి లభించింది. జూన్ నాటికి రెమ్‌డెసివిర్ ఉత్పత్తులు మార్కెట్‌లో విడుదలవుతాయని రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. నెలకు వంద మిల్లీ లీటర్ల సామర్ధ్యంతో 3.5 లక్షల బాటిల్స్, 5 వందల మిల్లీలీటర్ల సామర్ధ్యంలో 7 లక్షల ఇంజక్షన్లు తయారుచేసేలా యూనిట్ ఏర్పాటుకానుంది. ఇప్పటికే నక్కపల్లిలోని సెజ్‌లో హెటిరో డ్రగ్స్ (Hetero Drugs) ఈ ఇంజక్షన్లు తయారు చేస్తోంది. ఇదే సెజ్‌లో ఉన్న లారస్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 38.3 మిలియన్ల హెస్‌సీక్యూ మందుల్ని అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, సింగపూర్, బెల్జియం, మయన్మార్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
Also read: Eluru Municipal Corporation ఎలక్షన్ కౌంటింగ్‌కు AP హైకోర్టు అనుమతి, రాష్ట్ర ఎస్ఈసీ అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook