Eluru Municipal Corporation ఎలక్షన్ కౌంటింగ్‌కు AP హైకోర్టు అనుమతి, రాష్ట్ర ఎస్ఈసీ అలర్ట్

Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.

Written by - Shankar Dukanam | Last Updated : May 7, 2021, 02:11 PM IST
  • ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్
  • కోవిడ్ నిబంధనలతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
  • ఏలూరు కొర్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు అనుమతి
Eluru Municipal Corporation ఎలక్షన్ కౌంటింగ్‌కు AP హైకోర్టు అనుమతి, రాష్ట్ర ఎస్ఈసీ అలర్ట్

Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఓట్లు లెక్కించాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.

ఏపీలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు మార్చి 10న ఎన్నికలు ముగిశాయి. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు (Eluru Corporation Elections) సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ఆ తీర్పును సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన ఛీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల(AP Municipal Elections 2021)కు అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది.

Also Read: AP Covid Strain: ఏపీలో ఆ వైరస్ లేదని స్పష్టం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

గత కొన్నిరోజులుగా దీనిపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మరోసారి ఏపీ హైకోర్టు (AP High Court)లో వాదనలు జరిగినా తీర్పు మాత్రం రిజర్వ్ చేశారు. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందగానే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని సిద్ధంగా ఉన్నారు. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేయడం తెలిసిందే.

Also Read: Eluru Corporation Result: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలపై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News