Police playing poker game in vijayawada: ప్రస్తుతం దేశమంతా శరన్నవరాత్రి దుర్గమ్మ ఉత్సవాలు వైభవంగా జరుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ సర్కారు కూడా ప్రజలకు, భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సైతం ప్రత్యేకంగా భక్తుల కోసం బారికెడ్లను ఏర్పాటు చేసి భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనం ఈజీగా అయ్యేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం.. దుర్గమ్మ ఆలయం వద్ద బందో బస్తు కోసం ప్రత్యేకంగా పోలీసుల్ని సైతం కేటాయించింది.


ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా.. ఎలాంటి చోరీలు జరక్కుండా, అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు కూడా నిరంతంగా పహారా కాసేందుకు ఏపీ పోలీసుల్ని కేటాయించింది. అయితే.. కొంత మంది పోలీసులు.. పవిత్రమైన అమ్మవారి డ్యూటీకీ వచ్చి పాడు పనులు చేస్తు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


పూర్తి వివరాలు..
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగాజరుగుతాయి. ఈ నేపథ్యంలో.. అక్కడ బందో బస్తు కోసం ప్రత్యేకంగా పోలీసుల్ని కేటాయించారు. అయితే.. కొంత మంది ఉన్నతాధికారులు మాత్రం చేసిన పనులు మొత్తం పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకొచ్చేలా మారిందని చెప్పుకొవచ్చు.


ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ..  నలుగురు సీఐలు కూడా దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చారు. అయితే..వాళ్లు లాడ్జీ రూమ్ లలో పేకటాలు ఆడుతూ రెచ్చిపోయారు. పోలీసులు అది కూడా అమ్మవారి ఆలయంకు విధులకు వచ్చి ఈ పాడు పనులు చేయడం ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారింది.


Read more: Tirumala: మరో వివాదంలో తిరుమల.. అన్నదాన కేంద్రంలోని పెరుగన్నంలో జెర్రీ.. షాకింగ్ వీడియో వైరల్..



వీరిలో.. టూ టౌన్ సీఐ కొండల రావు, పెను కొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు కలిసి ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియోలు చూసిన ప్రతీఒక్కరూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి వద్ద డ్యూటీకి వచ్చి ఇదేంటని ప్రశ్నిస్తున్నారు.  దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం తెగ వైరల్గా మారాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.