Divvela Madhuri: తిరుమలలో ఇదేంటీ గోవిందా.. అప్పట్లో నయనతార.. ఇప్పుడు దివ్వెల మాధురీ రచ్చ.. శివాలెత్తిపోతున్న నెటిజన్లు..
Duvvada Srinivas-divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీల వివాదం ఏపీలో రచ్చగా మారింది. ఈ క్రమంలో తిరుమలలో ఇప్పటికే వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Case filed against divvela madhuri in tirumala: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ మరోసారి వార్తలలో నిలిచారు. ఇటీవల వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటు తెగ హల్ చల్ చేస్తున్నారు. అయితే.. గతంలో దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణితో వివాదం ఏపీ వ్యాప్తంగా రచ్చగా మారింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ అక్టోబరు 7న తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లారు.
అక్కడ మాడ వీధుల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా.. శ్రీవారి ఆలయం ముందు తమ వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ రచ్చ చేశారు. అక్కడ వెడ్డింగ్ షూట్ కూడా చేశారని కూడా వార్తలు వైరల్ గా మారాయి. అయితే.. దీనిపై టీటీడీ మాత్రం సీరియస్ గా తీసుకుంది. తిరుమల పీఎస్ లో దివ్వెల మాధురీపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై తాజాగా, దివ్వెల మాధురీ స్పందించారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగా తమపై ఫిర్యాదులు చేశారన్నారు.
తమను కొంత మంది మీడియా వాళ్లే ప్రశ్నించడంతో తమ పెళ్లి గురించి ప్రస్తావించామన్నారు. అంతేకాకుండా.. తాము ఎలాంటి రీల్స్, వెడ్డింగ్ షూట్ లను చేయలేదని స్పష్టం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. దివ్వెల మాధురీ మూడో భార్యతో పెళ్లికాకముందే ఆమెను ప్రెగ్నెంట్ చేశారని దివ్వెల మాధురీ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. తాము.. ఆ వ్యాఖ్యలు చేసినందుకు.. ప్రతీకార చర్యలలో భాగంగా తమపై కేసులు పెట్టించారన్నారు. దీనిలో తాము లీగల్ గానే ముందుకు వెళ్తామన్నారు. శ్రీవారి ప్రతిష్టను, ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయలేదని దివ్వెల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మరోవైపు గతంలో నయతార తన భర్త విఘ్నేష్ శివన్ పెళ్లి తర్వాత మాడ వీధుల్లో ఫోటోలు దిగారు. నాయన తార ఏకంగా చెప్పులు ధరించి మరీ శ్రీవారి మెట్లను ఎక్కారు.
దీంతో అది అప్పట్లో రచ్చగా మారింది. ఈ క్రమంలో నయనతార, విఘ్నేష్ శివన్ ఈ ఘటనపై తమ పశ్చాత్తాపం సైతం వ్యక్తం చేయడంతో అప్పట్లో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు దివ్వెల మాధురీ వివాదం ఎక్కడకు వెళ్తుందో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏదీ ఏమైన శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.