కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు
కరోనా వైరస్ మనుషులు, జంతువులు, అన్ని రంగాలతో పాటు తాజాగా వాతావరణంపైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కాస్తు ముందుగానే వర్షాలు కురవనున్నాయి.
కరోనా వైరస్ (CoronaVirus) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. వాతావరణంపై సైతం కరోనా వల్ల మార్పులు కనిపిస్తున్నాయి. వాహనాలు మునుపటిలా రోడ్డెక్కకపోవడం, ఫ్యాక్టరీలు మూసివేవయడంతో వాతావరణంలో వేడి తీవ్రత తగ్గింది. ఫలితంగా రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా రాబోతున్నాయి.
సాధారణంగా ప్రతి ఏడాది జూన్ తొలి వారంలో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వస్తాయి. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా మే 16న నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. దీంతో మే 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అప్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే సోమవారం వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
రానున్న మూడు, నాలుగు రోజుల్లో గత వారం తరహాలోనే ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవనున్నాయి. తెలంగాణలో అయితే రెండు మే 12, 13 తేదీలలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కరోనా ప్రభావం వాతావరణంపై పడటంతో నైరుతీ రుతుపవనాలు కాస్త ముందుగానే దక్షిణ తీరాన్ని తాకనున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!