ED court summons AP CM YS Jagan | హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్‌కు సమన్లు జారీచేసింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల అవకతవకలపై (Quid pro quo case) చార్జిషీట్‌ విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం జగన్‌తోపాటు (AP CM YS Jagan) వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌‌‌పై అంతకుముందు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ఇటీవల ఈ కేసు ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. Also read: AP Local body elections 2021 Schedule: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల


అయితే (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జడ్చర్ల సెజ్‌లో అరబిందో, హెటిరో సంస్థలకు భూమి కేటాయింపుల్లో క్విడ్ ప్రోకొ (Quid pro quo) జరిగినట్లు సీబీఐ, ఈడీ చార్జీషీట్‌లో పేర్కొన్నాయి. అతి తక్కువ ధరకు భూ కేటాయింపులు జరిగినట్లు పేర్కొన్నాయి.


Also Read: AP: పంచాయితీ ఎన్నికలపై మళ్లీ రాజుకున్న వివాదం, ఎస్ఈసీ నిర్ణయంపై విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook