Mlc Elections: తెలుగు రాష్టాల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ శాసనమండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి రానుందిక.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. ప్రజలతో నేరుగా సంబంధమున్న ఎన్నికలు కాకపోయినా..రాజకీయాలు వేడెక్కడం ఖాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు  ( Mlc Elections ) కేంద్ర ఎన్నికల సంఘం ( Election commission of india ) షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చ్ 14న పోలింగ్ జరగనుండగా..17వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో ఆ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. 


ఏపీ ( Andhra pradesh ) లో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ( Teachers Mlc elections ) పదవుల ఎన్నిక జరగనుంది. ఏపీలో ఆర్ఎస్ఆర్ మాస్టారు, రామకృష్ణ రిటైర్ కానుండగా..తెలంగాణలో రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు రిటరై కానున్నారు. తెలంగాణ ( Telangana ) లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ( Graduate mlc elections ) కు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించింది. అటు పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరోసారి టీఆర్ఎస్ ప్రకటించింది.  మరో అభ్యర్ధిని టీఆర్ెస్ త్వరలో ప్రకటించనుంది. పంచాయితీ ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party )రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని గెల్చుకుని..విధానసభలో బలం పెంచుకోడానికి యోచిస్తోంది. 


Also read: Polavaram project: శరవేగంగా పోలవరం పనులు, పూర్తయిన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook