Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2022 డిసెంబర్ లక్ష్యంగా ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కీలకమన స్పిల్ వే పనులు దాదాపుగా పూర్యయ్యాయి.
బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram project ) పనులు వేగమందుకున్నాయి. 2022 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ( Ap government ) ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. పోలవరం డ్యాం ( Polavaram Dam )కు సంబంధించి కీలకమైనది స్పిల్ వే నిర్మాణం. స్పిల్ వే ఇప్పుడు దాదాపుగా పూర్తయింది. స్పిల్ వేలో 52 మీటర్ల ఎత్తులో 52 పిల్లర్లు ఉన్నాయి. స్పిల్ వే ( Spillway ) నిర్మాణంలో ఇదే కీలకం. వాస్తవానికి స్పిల్ వేలో రెండవ బ్లాక్ ఫిష్ లాడర్ నిర్మాణం చేపట్టిన కారమంగా డిజైన్ అనుమతులు రావడంలో ఆలస్యమవడంతో 2వ పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. ఇటీవలే డిజైన్లు అన్నింటికీ అనుమతులు వచ్చాక..త్వరిత గతిన స్పిల్ వే పిల్లరన్నింటినీ 52 మీటర్ల ఎత్తున అంటే స్లాబ్ లెవల్‌కు పూర్తి చేశారు.
స్పిల్ వే ( Spillway ) బ్రిడ్జి స్లాబ్ పొడవు 1128 మీటర్లలో ఇప్పటికే 1095 మీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు పెట్టాల్సిన ఉండగా ఇప్పటికే 188 గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఇంకా నాలుగు గడ్డర్లు అమర్చాల్సి ఉంది. స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటును మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. 2020 సెప్టెంబర్ 9న పనలు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ..ఇప్పటికే 45 స్లాబ్ లను పూర్తి చేసింది. ఇంకా మూడు స్లాబ్ లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 49 ట్రూనియన్ బీమ్ ల పనులు పూర్తి చేయడమే కాకుండా..స్పిల్ వే లోని 48 గేట్లలో 28 గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇంకా గేట్లకు సిలెండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చేందుకు వీలుగా ప్లాట్ ఫాం పనులు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook