Chandrababu vs YS Jagan: తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించారనే వివాదంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్న వేళ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేయరాని పాపం చేశాడని.. అతడు చేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలు


తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఆదివారం సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో సీఎం చంద్రబాబు చేస్తున్న దారుణ విషయాలపై పూసగుచ్చినట్లు వివరించారు. ఆ లేఖపై వెంటనే చంద్రబాబు స్పందించి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Also Read: Tirupati Laddu: నాడు శ్రీరాముడి విగ్రహం తల నరికితే ఎవరూ మాట్లాడలే? ఇప్పుడు? పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం


'పవిత్రమైన తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారు' అంటూ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బ తీశారని వాపోయారు. జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లు తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని ఆరోపించారు. లడ్డూ తయారీకి వాడే పదార్థాలపై రివర్స్‌ టెండరింగ్‌ పెట్టి నాణ్యత దెబ్బతీశారని విమర్శించారు. 'ఇష్టానుసారం వీఐపీ టికెట్లు అమ్ముకోవడం సహా ఎన్నో అక్రమాలు చేశారు. అన్యమతస్తులను తితిదే చైర్మన్‌గా నియమించారు. తప్పు చేసిన అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామివారు సెటిల్‌ చేస్తారు. అది శ్రీవారి మహాత్యం' అని చంద్రబాబు తెలిపారు.


ప్రధానికి జగన్‌ రాసిన లేఖపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు దానిని చదివి వినిపించారు. 'చేసి తప్పును సమర్ధించుకుంటూ ప్రధానికి లేఖ రాయడానికి జగన్‌కు ఎంత ధైర్యం? రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్తుడు కాబట్టే జగన్‌ను ఎస్కోబార్‌ అని విమర్శించా' అని గుర్తు చేశారు. 'ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారు. ఒక్కొక్క స్టేట్‌మెంట్‌ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోంది' అని తెలిపారు. 'తిరుమల ప్రక్షాళనకు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు' అని పేర్కొన్నారు. ఐజీ కన్నా పై అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ చేస్తామని.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.