Anil Kumar Yadav Clarity On Muslim Cap Wearing: అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ముస్లి టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే తాను ముస్లిం టోపీ ధరించడంపై అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అయ్యప్ప మాలలో ఉన్న నేను ఏదో పాపం చేసినట్లు బీజేపీ, బీజేవైఎం నాయకులు ఓవరాక్షన్ చేస్తున్నారు. నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లలకు ధర్మాలు అవేవి తెలియదు పాపం. ఏదో వచ్చారు ఎగరేసుకుని పోయారు. సోము వీర్రాజు వంటి పెద్దలు కనీసం ఆలోచన చేయాలి. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఈ విషయం కూడా తెలియదా..? వావర్ స్వామి ముస్లిం కాదా..?


మొదటిసారి అయ్యప్ప మాల ధరించిన భక్తులు వావర్ స్వామి మసీదును దర్శించుకుంటారు. వాళ్ల అయ్యప్ప మాల ధరించారో నాకు తెలియదు. ఓట్ల రాజకీయం, నీచ రాజకీయం ఎవరు చేస్తున్నారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. ముస్లిం దేవతలను ప్రార్థించే వారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారు. నేను హిందువులను అవమానించినట్లు వాళ్లు మాట్లాడటం సరికాదు. నేను చేసింది తప్పు కాదని ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా వారు విజ్ఞతతో ఆరోపణలు చేయాలి..' అని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. 


నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక ముస్లింలు కలిశారు. ఈ నేపథ్యంలోనే వారి మతాచారాలకు అనుగుణంగా టోపీ, కండువా ధరించి వారితో కరచాలనం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి ముస్లిం టోపీ ధరించడంతో అనిల్ కుమార్ యాదవ్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ నేతలకు కౌంటర్‌గా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.


Also Read: Sanju Samson: ఒక్క మ్యాచ్‌కే సంజూ శాంసన్ బెంచ్‌కు.. ఎందుకు ఈ వివక్ష..?  


Also Read: Gujarat Elections 2022: సహోద్యోగుల‌పై జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook