Airoplane flying over Tirumala srivari temple: తిరుమలలో ఇటీవల అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొవచ్చు. కూటమి సర్కాు, టీటీడీ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలపై మాత్రం శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. మరో ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఏకంగా విమానయాన మంత్రి ఉన్నప్పటికి కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగటం పట్ల శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తుచేస్తున్నట్లు తెలుస్తొంది. తిరుమలలో సమీపంలో ఈరోజు మరల విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్రం ప్రకారం.. తిరుమలలో శ్రీవారి గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. అదే విధంగా ప్రస్తుతం దీనిపై వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది.


ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. ఇప్పటికే నో ఫ్లై జోన్ గా తిరుమల ఆలయంపై నుంచి రాకపోకలు సాగించకుండా.. నిర్ణయం తీసుకొవాలని కోరినట్లు తెలుస్తొంది. కానీ విమానయాన అధికారులు మాత్రం దీనిపై సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదని తెలుస్తొంది. తాజాగా, మరల ఈ వివాదం మాత్రం చర్చనీయాంశంగా మారింది.  


Read more: Tirumala: న్యూ ఇయర్ వేళ శ్రీవారి భక్తులకు వరుస శుభవార్తలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..


తిరుమలలొ ఇటీవల నేతలు రాజకీయాలు గురించి మాట్లాడిన ఘటనలు వివాదాస్పదంగా మారాయి. అదే విధంగా కొంత మంది రీల్స్ చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. అంతే కాకుండా.. తిరుపతిలో ముఖ్యంగా కొంత మంది వీడియోలు, ఫోటోషూట్లు చేయడం కూడా ప్రస్తుతం పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం టీటీడీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter