Tirumala: న్యూ ఇయర్ వేళ శ్రీవారి భక్తులకు వరుస శుభవార్తలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..

Tirupati: కొత్త ఏడాది వేళ టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు ముక్కోటి ఏకాదశి వేళ స్వామిని ఎలాగైన దర్శించుకొవాలని అనేక ప్లాన్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
 

1 /6

తిరుమల శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని చెప్పవచ్చు.  శ్రీవారి దర్శనం కోసం ఎంత ఆపసోపాలైన భక్తులు పడుతుంటారు. అదే విధంగా తనివీ తీరా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆరాట పడుతుంటారు.  

2 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల తిరుమలో వైకుంఠ ఏకాదశి వేళ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా టీటీడీ, చంద్రబాబు సర్కారు కూడా సామాన్య భక్తులు ప్రయారిటీ చర్యలు చేపట్టారు. 

3 /6

ఇదిలా ఉండగా.. తిరుమలలో.. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక్క రోజు అన్నప్రసాద విరాళ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్నిదానాల్లో కన్నా కూడా అన్నదానం గొప్పదని చెప్తుంటారు.  

4 /6

టీటీడీ నిత్యం 3 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తోన్నట్లు సమాచారం.మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్,తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం,తిరుచానూరులో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.   

5 /6

అదే విధంగా.. మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, స్విమ్స్, తిరుచానురు, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా.. భక్తులకు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు.దీనితో పాటు పలు చోట్ల కాఫీలు, టీలు కూడా వితరణ చేస్తున్నారు.  

6 /6

 అయితే ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు రూ.43 లక్షలు వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం..టిఫిన్ ల కోసం 9 లక్షల రూపాయలు అందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కోసం రూ.15లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తొంది. తాజాగా.. ఈ దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించే అవకాశం టీటీడీ కల్పించి నట్లు తెలుస్తొంది.