YS Jagan Another Yatra Against TDP Attacks: ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాకాండలుచోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం.. నాయకులు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో యాత్రకు సిద్ధమైతున్నట్టు కనిపిస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ నాయకుడు దారుణ హత్యతో జగన్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. రషీద్‌ కుటుంబాన్ని పరామర్శకు వెళ్తున్న జగన్‌ అక్కడి నుంచే ఓదార్పు యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Assembly Session: అసెంబ్లీకి వైఎస్ జగన్‌ వెళ్తారా? లేదా చంద్రబాబులా బహిష్కరిస్తారా?


రాష్ట్రంలో జరుగుతున్న దారుణ సంఘటనలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఏపీల రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని జగన్‌ మండిపడుతున్నారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వగలపూడి అనితను నిలదీశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ స్వయంగా వినుకొండ వెళ్లనున్నారు.

Also Read: Kalingiri Shanthi: బాధ్యతల్లో భాగంగా ఎంపీ విజయ సాయిని కలిస్తే రంకు అంటగడుతారా? కలింగిరి శాంతి


రషీద్ అంత్యక్రియలకు..
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబసభ్యులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. ఈ మేరకు జగన్‌ పర్యటన ఖరారైంది. దీనికోసం బెంగళూరు నుంచి జగన్‌ తాడేపల్లికి చేరుకున్నారు. శుక్రవారం జరగనున్న రషీద్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు జరిగే ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  అనంతరం ఈ దాడిపై తీవ్ర పోరాటం ప్రకటించే అవకాశం ఉంది.

తీవ్రంగా పరిగణన
వినుకొండ ఘటనను జగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. నడిరోడ్డు మీద అత్యంత కిరాతకంగా రషీద్‌ను హతమార్చారు. ఈ ఘటన జరిగిన రోజే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో జగన్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్‌ కుటుంబానికి అండగా నిలవాలని.. వారికి ధైర్యాన్నివ్వాలని సూచించారు. ఇప్పుడు తాజాగా ఆయన రంగంలోకి దిగడం చూస్తుంటే మరో ఓదార్పు యాత్రలాగా కనిపిస్తోంది.


భయాందోళనలో ఉన్న శ్రేణులకు భరోసా
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా తమకు వ్యతిరేకంగా ఉన్న సాధారణ ప్రజలపై కూడా ప్రతాపం చూపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే దాదాపు 50కి పైగా దారుణ సంఘటనలు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయాందోళనతో జీవిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చేందుకు.. నైరాశ్యంలో ఉన్న వారికి ఉత్తేజం నింపేందుకు జగన్‌ రంగంలోకి దిగనున్నారు. అయితే ఓదార్పు యాత్రనా? లేక మరో పాదయాత్రనా? అనేది తెలియడం లేదు. కానీ మొత్తానికైతే టీడీపీ శ్రేణుల దాడుల్లో నష్టపోయిన.. గాయపడిన కుటుంబాలను మాత్రం జగన్‌ పరామర్శించనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి