అనారోగ్యంతో మాజీ మంత్రి, వైసిపి నేత మృతి
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా ( Khaleel Basha ) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా ( Khaleel Basha ) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన ఖలీల్ బాషా మృతి పార్టీ నేతలు, కార్యకర్తలకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి సేవలు అందించారు. Also read : డిప్యూటీ సీఎం పదవిపై Sachin Pilot వ్యాఖ్యలు
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 5న ఖలీల్ భాషా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు చేశారని.. వైఎస్ జగన్ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుకుంటున్నందున జగన్ కూడా సీఎం అయితే బాగుంటుందని అప్పుడే ఖలీల్ భాషా అభిప్రాయపడ్డారు. జగన్ సీఎం కావాలని బలంగా కోరుకున్న నాయకులలో ఒకరైన ఖలీల్ బాషా ఇలా ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నారు. ఖలీల్ బాషా అంత్యక్రియలు బుధవారం కడప జిల్లాలో జరగనున్నాయి. Also read: ఆస్తిలో కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు