Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి వ్యాను బోల్తా పడి నలుగురు మృతి..
Road Accident in Krsihna District: కృష్ణా జిల్లాలో ఓ పెళ్లి వ్యాను బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
Road Accident in Krsihna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పెళ్లి వ్యాను చింతలమడ నుంచి మోపిదేవి వెళ్తుండగా కాసానగర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో మొత్తం 15 మంది ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మదనపల్లి మండలం పుంగనూరు వద్ద కారు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు భార్యాభర్తలు కాగా మరో ఇద్దరు వారి పిల్లలు. మృతులను గంగిరెడ్డి, మాధవీలత, కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. బుధవారం (మే 25) అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి