ROAD ACCIDENT: బీహార్ లో రోడ్డు ప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ మహిళ మృతి.. 38 మందికి గాయాలు

ROAD ACCIDENT: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ప్రయాణికులకు ప్రమాదం జరిగింది. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్  జిల్లాకు చెందిన బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వెల్మల్ కు చెందిన సరళమ్మ అనే మహిళ మృతి చెందింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 09:58 AM IST
  • బీహార్ లో రోడ్డు ప్రమాదం
  • కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ మహిళ మృతి
  • సహాయచర్యలను పర్యవేక్షించిన ఎంపీ అర్వింద్
ROAD ACCIDENT: బీహార్ లో రోడ్డు ప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ మహిళ మృతి..  38 మందికి గాయాలు

ROAD ACCIDENT: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ప్రయాణికులకు ప్రమాదం జరిగింది. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్  జిల్లాకు చెందిన బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వెల్మల్ కు చెందిన సరళమ్మ అనే మహిళ మృతి చెందింది. బస్సులో ప్రయాణిస్తున్న జిల్లాలోని నందిపేట మండలం వెల్మల్, దత్తాపూర్, తల్వేద, డొంకేశ్వర్ కు చెందిన 38 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. చనిపోయిన సరళమ్మ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆంబులెన్స్ లో నిజామాబాద్ కు అక్కడి అధికారులు తరలిస్తున్నారు.

నందిపేట మండలంలోని వెల్మల్, దత్త పూర్,తల్వేద, డొంకేశ్వర్  తదితర గ్రామాల నుండి కాశీ యాత్రకు 38 మంది ప్రయాణికులు ఇటీవల బయలు దేరారు.  ప్రైవేట్ బస్సు బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో వెనకాల నుండి లారీ ఢీకొట్టడంతో వీరు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అర్వింద్ ధర్మపురి మంగళవారం రాత్రి నుండి  ఔరంగాబాద్ ఎంపీ  సుశీల్ సింగ్, స్థానిక బిజెపి నాయకులతో, అక్కడి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చందన్ సింగ్ తో మాట్లాడారు, మృతదేహాన్ని అంబులెన్సులో,   క్షతగాత్రులను అందరినీ ప్రత్యేక బస్సులో నిజామాబాద్ జిల్లాకు రప్పించే ఏర్పాట్లు చేశారు ఎంపీ అర్వింద్.

READ ALSO: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..

READ ALSO:Edible Oils: కస్టమ్స్, అగ్రిసెస్ మినహాయింపు, భారీగా దిగుమతి, తగ్గనున్న వంటనూనె ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News