దారుణం: దివ్యాంగురాలిపై అఘాయిత్యం... నోట్లో గుడ్డలు కుక్కి, 4గంటలు చిత్రవధ!
గుంటూరులో మరో అఘాయిత్యం.. దళిత యువతిని నడిరోడ్డుపై పొడిచిన ఘటన మరవక ముందే, మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం జిల్లాలో కలకలం రేపుతుంది.
Guntur: గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో దళిత యువతి అయిన మానసిక దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో నోట్లో గుడ్డలు కుక్కి చిత్రవధ చేసిన సంఘటన జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
గుంటూరు జిల్లా నల్లకుంతకి (Nallakuntha) చెందిన దంపతులకు మొత్తం ముగ్గురు కుమార్తెలు. ఆర్‌ఆర్‌పాలెం (పులిచింతల పునరావస కేంద్రం) సెంటర్‌లో ఉంటున్న నాయనమ్మ దగ్గర ఇద్దరు కుమార్తెలను ఉంచారు. మానసింగా ఎదుగుదల లేని పెద్ద కుమార్తెను వారి వద్దే ఉంచుకొని, పదోతరగతి వరకి వారు ఉంటున్న ఊర్లో చదివించారు.
Also Read: AP Minister Avanti Srinivas: "ఇంటికి రా.. అరగంటలో పంపిస్తా.." మహిళతో ఏపీ మంత్రి రాసలీలలు
నాయనమ్మ మరణించిందని తెలిసిన దంపతులు పెద్ద కుమార్తెను ఇంట్లోనే ఉంచి అత్యక్రియల కోసం రాజుపాలెం వెళ్ళారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మానసిక దివ్యాంగురాలిపై అదే ఊళ్ళో ఉంటున్న లాబు (27), సంజయ్ (35) అఘాయిత్యానికి పాల్పాడ్డారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ ఇంట్లోకి లాక్కెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కు పైశాచికంగా యువతి ఒంటిపై రక్కి చిత్రవదకు గురి చేసారు.
ఇంటికి వచ్చిన తల్లి తండ్రులు కూతురి పరిస్థితిని చూసి, వెంటనే పోలీసులను ఆశ్రయించగా, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు (GGH) తరలించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచాస్తున్నట్లు తెలుస్తుంది. మానసికంగా, శారీరకంగా యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వాపోతున్నారు.
వరుసగా జరుగుతున్న ఘటనతో గుంటూరు జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లా నడి బొడ్డున పట్టపగలే నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణహత్య మరవక ముందే రాజుపాలెంలో 17ఏళ్ల దళిత యువతిపై అఘాయిత్యం... జిల్లా వాసులను కలవర పెడుతున్నాయి.
Also Read:'RRR' movie update: అభిమానులకు మళ్లీ నిరాశే.. వాయిదా పడ్డ 'RRR' రిలీజ్ డేట్..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook