Global Investors Summit 2023: ఇదంతా ఓ ఎత్తైతే ముఖ్యమంత్రి జగన్, ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీల దృశ్యాలు అన్ని మీడియాల్లో చర్చకు తెరలేపాయి. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్ జగన్‌కు ముకేష్ అంబానీ ఇచ్చిన ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం వేదికగా మార్చ్ 3, 4 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసినా మీడియాలో ఇదే చర్చనీయాంశమౌతోంది. దీనికి ప్రధాన కారణం అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు ప్రభుత్వం ఊహించినదానికంటే అత్యధికంగా పెట్టుబడులు రావడం. రెండ్రోజుల సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు 353 ఎంవోయూలు కుదిరాయి. దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని సదస్సుకు హాజరయ్యేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యంగా అంబానీ, కరణ్ అదానీ, జిఎమ్మార్, పునీత్ దాల్మియా, ప్రీతారెడ్డి, సజ్జన్ భజాంక్, హరిమోహన్ బంగూర్, జిందాల్, నవీన్ మిట్టల్, మోహన్ రెడ్డి, డాక్టర్ కృష్ణా ఎల్లా, కుమార మంగళం బిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంతమంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. 


ఇదంతా ఓ ఎత్తైతే సమ్మిట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మధ్య ఉన్న సాన్నిహిత్యం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సమ్మిట్ ముగిసినా ఇదే అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇద్దరూ సమ్మిట్‌లో ఎంత క్లోజ్‌గా ఉన్నారో చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలు నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సుకు ముకేష్ అంబానీ చాలా అరుదుగా పాల్గొన్నారు. ఏపీకు స్వయంగా రావడమే కాకుండా..వేదికపై ప్రతి అంశంలోనూ ఉండటం చూస్తుంటే..ఆయన కూడా నిర్వాహకులా అన్పిస్తుంది. వైఎస్ జగన్ పక్కనే కూర్చుని వివిధ అంశాలపై ఏదో చర్చించడం, మనస్ఫూర్తిగా ఇద్దరూ నవ్వుకోవడం ఇదంతా జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. 


[[{"fid":"264609","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mukesh-ambani closeness","field_file_image_title_text[und][0][value]":"ముకేష్ అంబానీల సాన్నిహత్యం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mukesh-ambani closeness","field_file_image_title_text[und][0][value]":"ముకేష్ అంబానీల సాన్నిహత్యం"}},"link_text":false,"attributes":{"alt":"Mukesh-ambani closeness","title":"ముకేష్ అంబానీల సాన్నిహత్యం","class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడుల్ని స్వయంగా ముకేష్ అంబానీ ప్రకటించడమే కాకుండా..ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్ జగన్‌లపై ప్రశంసలు కురిపించడం సమ్మిట్‌కు హైలైట్ అయింది. ముకేష్ అంబానీ స్వయంగా విశాఖ సదస్సుకు హాజరు కావడమే కాకుండా..తన సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో చేరుకోవడం మరో విశేషం.


Also read: Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లక్ష్యం విశాఖ రాజధాని కూడానా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook