వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం ( Visakhapatnam )లో ఇకపై తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి ఉండదు. అందుకే విశాఖపట్నం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. గోదావరి జలాల్ని విశాఖకు తరలించి..తాగునీటి సమస్యను దూరం చేయడమే ఈ ప్రణాళిక. 


గోదావరి నీటిని ( Godavari water to Visakha ) విశాఖకు అందించడం అంత సులభమేం కాదు. 220 కిలోమీటర్ల దూరం గోదావరి జలాల్ని తరలించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) ప్రాంతం నుంచి విశాఖపట్నంకు 220 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన.  దీని కోసం 4 వేల 660 కోట్ల ఖర్చవుతుందనేది ప్రాధమిక అంచనా. డీపీఆర్( DPR ) తయారీకు కార్యాచరణ సిద్ధమవుతోంది. 


ప్రస్తుతం తాగునీటి కోసం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( GVMC ) ఏడాదికి 120 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ( Water Pipeline project ) పూర్తయితే..జీవీఎంసీకు ఏడాదికి 50-60 కోట్లు ఆదా అవుతాయి. పైప్ లైన్ ద్వారా తరలించే నీటిని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ లో స్టోర్ చేయాలనేది ఆలోచన. భౌగోళిక పరిస్థితుల్ని బట్టి 2.2  నుంచి 2.5 మీటర్ల వ్యాసార్ధమున్న పైపుల్ని అమర్చుతారు. అవసరమైన చోట పంపుసెట్లు, సంప్ ల నిర్మాణముంటుంది. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 12 టీఎంసీల నీటిని పైప్ లైన్ ద్వారా తరలించాలనేది ప్రతిపాదనగా ఉంది. 


ఈ పైప్ లైన్ ద్వారా విశాఖతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, తుని ప్రాంతాలకు కూడా తాగునీరు అందించనున్నారు. భవిష్యత్ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. Also read: AP: ఆ టీడీపీ నేత ఎగ్గొట్టిన రుణం ఎంతో తెలుసా..ఇప్పుడా ఆస్థులు వేలం