AP Summer Holidays: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మరి కొద్దిరోజుల్లో పదో తరగతి పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీనికితోడు ఎండల తీవ్రత పెరుగుతుండటం, ఎన్నికల సమయం కావడంతో ముందుగా సెలవులిచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో  ప్రస్తుతం ఒంటి పూట బడులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఇంటర్ పరీక్షలు ముగియడం, ఇంకో పది రోజుల్లో పదో తరగతి పరీక్షలు పూర్తి కానుండటమే కాకుండా ఎన్నికల సమయం కూడా ఉంది. దాంతో ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ముందస్తుగా సెలవులు ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఏప్రిల్ 6 నుంచి ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి 19 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. 


పదో తరగతి విద్యార్ధులకు ఈ నెల 30తో పరీక్షలు ముగిశాక సెలవులు ఇవ్వనున్నారు. ఇక మిగిలిన విద్యార్ధులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకూ అంటే దాదాపుగా 50 రోజులు సెలవులు ఇచ్చే అవకాశముంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెలవులు ఎక్కువగా ఉండబోతున్నాయి


Also read: Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook