ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో విభాగాన్ని చక్కబెడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు వైఎస్ జగన్ (AP CM YS Jagan) సర్కార్ శుభవార్త అందించింది. జీతాల సమస్య నుంచి తమకు పరిష్కారం చూపాలని కోరిన ఏపీలోని ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల (Contract Lecturers Salaries In AP)కు ఊరట కలిగించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఇప్పటివరకూ అందుకుంటున్న 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆదివారం సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడాదిపాటు ప్రతినెలా జీతాలను కాంట్రాక్ట్ లెక్చరర్ల (AP Contract Lecturers Salaries)కు అందించేలా త్వరలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని 5,042 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రైవేట్ ఓరియంటల్, ప్రభుత్వం ఒకేషనల్ కళాశాలల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇకనుంచి 12 నెలలపాటు జీతం అందనుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



 


 


ఫొటో గ్యాలరీలు


నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్


Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..


Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe