ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం ( Visakhapatnam ) నూతన హంగులు సంతరించుకుంటోంది. సంఘ విద్రోహశక్తుల ఆటకట్టించే గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇప్పటికే  ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఏపీ డీజీపీ ఆమోదం తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో శాంతిభద్రతల్ని పరిరక్షించేందుకు, నక్సల్ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చురుకైన యువతకు శిక్షణ ఇచ్చే గ్రేహౌండ్స్ శిక్షణా సంస్థ ( Grehounds Training Centre ) ఇప్పుడిక విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారనున్న విశాఖ ఏపీ గ్రేహౌండ్స్ కు వేదిక కానుంది. ప్రభుత్వం ఇప్పటికే 385 ఎకరాల స్థలాన్నికేటాయించింది. జగన్నాధపురం సమీపంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలం అనువుగా ఉందా లేదా అనే విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Ap Dgp Gowtham sawang ) పరిశీలించారు. పరిశీలన అనంతరం ఈ స్థలం అన్నివిధాలా అనుకూలమని డీజీపీ ఆమోదం కూడా తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఆపరేషన్ బేస్డ్ గ్రేహౌండ్స్ కార్యాలయముంది. కలెక్టర్ వినయ్ చంద్  కూడా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన 385 ఎకరాల్లో 265 ఎకరాల డి పట్టా భూములున్నాయి. ఈ భూమిని సాగుచేసుకుంటున్నవారికి పరిహారంగా ఇప్పటికే ప్రభుత్వం పది కోట్ల 55 లక్షల్ని కేటాయించింది. Also read: Kapu Udyamam: తుని రైలు దహన ఘటన కేస్ క్లోజ్ అయినట్టే


ఆంధ్రా ఒరిస్సా ఛత్తీస్ గఢ్ ( Andhra Odissa Chattis garh border ) సరిహద్దుల్లో నక్సల్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో విశాఖలో గ్రేహౌండ్స్ ఏర్పాటు కీలకంగా మారనుంది. Also read: AP: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు