కాపు రిజర్వేషన్ ఉద్యమంలో జరిగిన జన్మభూమి రైలు దహన కేసులో నిందితులపై కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. తాజాగా వెనక్కి తీసుకున్న కేసులతో దాదాపు అన్నికేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టైంది.
కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపు ఉద్యమం అందరికీ తెలిసిందే. ఆ ఉద్యమ సందర్బంగా జన్మభూమి రైలును తునిలో ఆందోళన కారులు తగలబెట్టారు. 2016 జనవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వం 69 కేసులు నమోదు చేసింది. రైలు దహనంతో శాంతియుతంగా ఉన్న ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 17 కేసుల్నితాజాగా ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు వెలువడ్డాయి. డీజీపీ సిపార్సుల మేరకు కేసుల్ని ఉపసంహరించుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే గత యేడాది ఇదే కేసుకు సంబంధించి 51 కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అన్నికేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టే. Also read: AP: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు