Heavy rains in Andhra pradesh traffic jam at Vijayawada and Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా వర్షం పడుతుంది. ఈ క్రమంలో.. రోడ్లన్ని చెరువులుగా మారిపోయాయి. ఎక్కడ చూసి వరద నీళ్లు కన్పిస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయమైపోయాయి. అంతేకాకుండా.. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, గుంటూరులో వరద బీభత్సం ఎక్కువగా ఉందని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. వరదల వల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో వర్షాల నేపథ్యంలో ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో ఇప్పటికి కూడా వర్షం ఆగకుండా పడుతునే ఉంది. ఇదిలా ఉండగా విజయవాడలోని బస్టాండ్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంద్రకీలాద్రి వద్ద కొండ చరియలు విరిగి పడటంతో ఆమార్గాన్ని మూసి వేశారు. అంతేకాకుండా.. ఇంద్రకీలాద్రి దగ్గర వంతెనను ఆనుకుని నీళ్లు ప్రవహిస్తున్నాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. ఈ నేపథ్యంలో.. నందిగామ మండలం మునగచర్ల వద్ద వరద నీరు జాతీయ రహదారి పైకి రావడంతో నిలిచిపోయిన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


అంతేకాకుండా..  విజయవాడ హైదరాబాద్ రహదారి పై భారీగా  వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసిన కూడా జాతీయ రహాదారిపైనీళ్లు రావడం వల్ల.. వాహానాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.దీంతో అధికారులు రంగంలోకి దిగి వాహానాలు మెల్లగా ఒకవైపు నుంచి వెళ్లేలా చేస్తున్నారు. కానీ రోడ్ల మీద భారీగా నీరు చేరడం వల్ల వాహానాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు కల్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ ను జారీ చేసింది. 


Read more: Hyderabad: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. సోమవారం స్కూళ్లకు హలీడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్..


ఇరు తెలుగు స్టేట్స్ లకు సైతం ఇప్పటికే రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. దీంతో ఏపీలోను, తెలంగాణలోను అధికారులు వరదలపై, భారీ వానాలపై అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లు తమ జిల్లాల అధికారులకు సూచించినట్లు సమాచారం.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.