Hyderabad: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. సోమవారం స్కూళ్లకు హలీడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్..

Heavy rains in hyderabad: రెండు తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది.

1 /8

 భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే విషయంలో.. ఆయా జిల్లాల కలెక్టర్ లు నిర్ణయాలు తీసుకొవాలని కూడా తెలంగాణ సర్కారు ఇది వరకే ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు జిల్లాలో వరదలపై ప్రభుత్వానికి  అప్ డేట్ లు ఇస్తుండాలని  కూడా సీఎస్ శాంతి కుమారీ అధికారులకు సూచించారు.  

2 /8

హైదరాబాద్ లో వర్షాలు నేపథ్యంలో. . జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే వాతావణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు పడుతాయని రెడ్ అలర్ట్ సైతం జారీ చేసింది. ఈ క్రమంలో 59 పునరావాసా కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్ర్ తెలిపారు. 

3 /8

అదే విధంగా.. రేపు ఆదివారం సెలవు అదే విధంగా.. సోమవారం 2 వ తేదీన కూడా స్కూళ్లకు సెలవును డిక్లెర్ చేశారు.  రాబోయే 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అన్నిశాఖలకు చెందిన అధికారులు నిబద్దతతో కలసి పనిచేయాలని కోరారు.  

4 /8

జిల్లాకలెక్టర్.. శనివారం సెక్రెటేరియట్ నుండి వివిధ శాఖల ఉన్నత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భారీ వర్షాల నేపథ్యంలో నిర్వహించిన  టెలికాన్ఫరెన్స్ లో  అదనపు కలెక్టర్ కదిరవన్ తో కలసిఅయన పాల్గొన్నారు. 

5 /8

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.   

6 /8

టెలి కాన్ఫరెన్స్  అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని  ఆదేశించారు.

7 /8

జిల్లాలో 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బి శాఖలతో పాటు జీహెచ్ఎంసి అధికారులు కూడా నిరంతరం విధులలో అప్రమత్తంగా ఉండాలని  సూచించారు.

8 /8

ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్ కలెక్టరేట్ లోని  కంట్రోల్ నెం. 040-23202813 / 9063423979 నెంబర్ తో పాటు  హైదరాబాద్ ఆర్డిఓ హైదరాబాద్ 7416818610 / 9985117660 , సికింద్రాబాద్ ఫోన్ నెంబర్ 8019747481 నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు, ఇబ్బందులను  తెలియజేయాలనీ ప్రజలకు కోరారు.