Heavy Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన..
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వరుణుడు ఒదలడం లేదు. ఒకదాని వెంట మరొకటి భారీ వర్షాలతో ఏపీ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా వాతావరణ శాఖ బంగాళాఖాతంలో మరో అల్ప పీడన ప్రభావంతో వాయు గుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో వాయు గుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21న ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడన ప్రభావం ఈనెల 23 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందన్నారు.
ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని చోట్ల కాలేజీలు, స్కూల్లకు సెలవులకు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో నెల్లూరుతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాలతో పాటు చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వరదల నేపథ్యంలో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి సహాయ పునరావాస చర్యలు చేపట్టింది. అటు అల్ప పీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter