AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో కోస్తా తీరంలోని జిల్లాలతో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయు గండం నేపథ్యంలో చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రజలు తమ బైకులు, కార్లు నీళ్లలో మునిగిపోకుండా ఉండడానికి ఫ్లై ఓవర్ పై పార్క్ చేసారు. భారీ ఈదరు గాలులకు కొన్ని చోట్ల పార్క్  చేసిన కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ిప్పటికే అల్ప పీడనం బలపడతంతో  ఉత్తర తమిళనాడులోని చెన్నై పరిసర జిల్లాలతో పాటు ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు  రాయలసీమ, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తల్లో భాగంగా  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్లకు, కాలేజీకి సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.  మరోవైపు వాయుగుండం తీరం దాటే సమయంలో 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు  జారీచేశారు.  


నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసారు. ఆయా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వ అధికారులు సహాయ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.  అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు  కడప, ప్రకాశంతోపాటు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, నదులుండే ప్రాంతాలకు  వరద ముప్పు ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి