Heavy Rains to Both Telangana and Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో గత మూడ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహరాష్ట్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి  రాయలసీమ, తెలంగాణ, ఒడిశా మీదుగా చత్తీస్‌గఢ్ వరకూ కొనసాగుతోంది. ఫలితంగా రాగల 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగనుంది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 


ఇటు ఏపీలో కూడా మరో 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇవాళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని..రేపట్నించి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో ద్రోణి, ఆవర్తనం కారణంగా గత రెండ్రోజులు వర్షాలు విస్తారంగా పడ్డాయి. వర్షాలకు తోడు వడగళ్లు, ఈదురు గాలులు, పిడుగులు భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.


ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక రేపట్నించి మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. రేపు అంటే మంగళవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.


Also Read: Heavy Rains Alert: రాగల 36 గంటల్లో భారీ వర్షాలు, విశాఖ, విజయవాడ నగరాల్ని ముంచెత్తనున్న భారీ వర్షం


Also Read: Niharika Konidela Disturbances: నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు.. అందుకే ఫోటోలు డిలీట్‌?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook