AP: ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం..హైకోర్టు హెచ్చరిక
AP: వివిధ రకాల పిటీషన్లతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడంతో పిటీషన్ వెనక్కి తీసుకున్నారు సదరు పిటీషనర్..
AP: వివిధ రకాల పిటీషన్లతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడంతో పిటీషన్ వెనక్కి తీసుకున్నారు సదరు పిటీషనర్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Government ) ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో బదిలీలుంటాయని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu suresh ) తెలిపారు. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై ఆదేశాలివ్వాలని బీసీ సంఘం తరపున నాగేందర్ రెడ్డి వాదించారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్ధుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల బదిలీలు ఉండేలా ఆదేశాలివ్వాలనేది పిటీషనర్ వాదన. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ( Ap high court ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉపాధ్యాయుల బదిలీలకు ( Teachers transfer ), బీసీ సంఘానికి సంబంధమేంటని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని..అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడుకుంటారని స్పష్టం చేసింది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయడమనేది పరిధి దాటి వ్యవహరించడమేనని కోర్టు ఘాటుగానే ఆక్షేపించింది. బీసీ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికల నేపధ్యంలో పిటీషనర్ పిల్ ఉపసంహరించుకున్నారు. Also read: Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధిని అంత తేలిగ్గా తీసుకోవద్దు