ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Andhra pradesh )కు..రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోతోంది. రాజ్యసభ సాక్షిగా న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేదని వ్యాఖ్యానించిన ఎంపీ విజయసాయి రెడ్డి ( Mp Vijaysai reddy ) మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గత ప్రభుత్వ ప్రతిపాదిత రాజధాని ప్రాంతమైన అమరావతి భూముల కుంభకోణం కేసు ( Amarvati land scam )..న్యాయవ్యవస్థకు..ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని పెంచేసింది. ఇప్పటికే పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు హైకోర్టు కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజ్యసభ ( Rajyasabha MP )ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ ( Rajyasabha ) లో చర్చ సందర్బంగా అయితే న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. హైకోర్టు నిర్ణయాలు అసాధారణంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 


అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ( 3 ) ప్రకార హైకోర్టు ( high court ) కు స్టే ఇచ్చే అధికారం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. ఒకవేళ హైకోర్టుకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేనిపక్షంలో అదే కేసును సీబీఐకు అప్పగించవచ్చని వ్యాఖ్యానించారు. అలా కాకుండా అమరావతి భూముల కుంభకోణం కేసులో హైకోర్టు స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చంద్రబాబు చేసిన అవినీతి పై దర్యాప్తు చేసి ఆ నిధిని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడట కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. 


అమరావతి రాజధాని భూముల స్కాంపై కోర్టు స్టే  ఇవ్వడం దురదృష్టకరమని మరో ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు. కేసును సీబీఐ విచారణ ( CBI probe ) కు ఇవ్వాలని కోరారు. సైబర్ నెట్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అదే విధంగా మంత్రివర్గ ఉపసంఘం విచారించి సిట్‌ను ఏర్పాటు చేస్తే దానిపై స్టే ఇచ్చారని ఇంకో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు.  మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఆర్డర్ ఇచ్చారని..వాస్తవానికి భూముల స్కాంను సీబీఐ విచారణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.


అమరావతి భూముల కుంభకోణం కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ దాఖలు చేసిన కేసుపైనే కాకుండా...విచారణపై కూడా హైకోర్టు స్టే ఇవ్వడంతో  ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. Also read: Krishna River: కృష్ణానదిపై మరో రెండు బ్యారేజ్ లకు గ్రీన్ సిగ్నల్