High Temperatures: వేసవి తీవ్రత అంతా కోస్తాంధ్ర జిల్లాల్లో కన్పిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికమౌతోంది. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రత కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే నెల దాటేసినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా , గుంటూరు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గత వారం రోజుల్నించి ఇదే పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాత్రి 7 గంటల వరకూ వడగాల్పులు కొనసాగుతున్నాయి. మే 22వ తేదీన రాజమండ్రిలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదు కాగా, 23వ తేదీన 48 డిగ్రీలు అత్యధికంగా నమోదైంది. అదే సమయంలో విజయవాడ, గుంటూరులో 42 డిగ్రీలు నమోదైంది. తిరిగి 4 రోజుల్నించి ఎండలు పెరిగిపోయాయి. మే 31వ తేదీన రాజమండ్రిలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదు కాగా, గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 42 డిగ్రీలు నమోదైంది. ఇక జూన్ 1వ తేదీన అంటే నిన్న రాజమండ్రిలో మరోసారి అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు కాగా, విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 


ఎండల తీవ్రత వడగాల్పుల కారణంగా మద్యాహ్నం 1 గంటైతే చాలు రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6 గంటలైనా రోడ్లపై జనం కన్పించడం లేదు. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జూన్ 8 వరకూ రోహిణి కార్తె కొనసాగనున్నా..నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో  2 రోజుల్లో ఎండలు తగ్గుముఖం పట్టవచ్చని తెలుస్తోంది. 


Also read: Divyavani Comments: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు..దివ్య వాణి సంచలన వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook