Nandamuri Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. వీడియో వైరల్..
Nandamuri Balakrishna:బాలయ్య మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. కదిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చారు. స్థానిక టీడీపీ లీడర్లు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో కొందరు బాలయ్యతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.
Nandamuri Balakrishna Slaps Again His Fan In Kadiri: హిందుపురం ఎమ్మెల్యే, నందమూరీ బాలకృష్ణ మరోసారి ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా బాలయ్య.. ఎంతో సీరియస్ గా ఉంటారు. ఇప్పటికే పలు సందర్భాలలో ఆయన ఫ్యాన్స్ పై చేయిచేసుకున్న ఘటనలు వార్తలలో నిలిచాయి. ఆయన సినిమా రిలీజ్ ప్రొగ్రామ్ లు, పొలిటికల్ ర్యాలీలు, పబ్లిక్ కార్యక్రమాలలో కూడా చాలా సార్లు ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తుంటాయి. కొందరు కావాలని చేస్తారో.. లేదా బాలయ్యతో ఒక దెబ్బ తింటే ఆ మజానే వేరుగా ఉంటుందని భావిస్తారో కానీ.. ఆయనకు కోపం వచ్చేలా మాత్రం కొంత మంది ఫ్యాన్స్ ప్రవర్తిస్తుంటారు.
బాలకృష్ణ రెండురోజుల పాటు అనంతపురం జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. స్వర్ణాంధ్ర సాకారాయాత్ర పేరిట ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా.. ఆయన ఈరోజు కదిరిలో హెలికాప్టర్ లో చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున స్థానిక నేతలు, ఆయన ఫ్యాన్స్ తరలివచ్చారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. అంతే కాకుండా.. కొందరు అత్యుత్సాహంతో సెల్ఫీలు దిగేందుకు కూడా పోటీ పడ్డారు.
ఈ క్రమంలో బాలయ్య బాబు తీవ్ర అసహానానికి గురయ్యారు. ఒక అభిమాని ఆయనపై చేయివేసేందుకు ప్రయత్నించగా.. వెంటనే అలర్ట్ అయి మోచేతితో ఒక్కటిచ్చి, దూరంగా ఉండాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా అలర్ట్ అయ్యారు. బాలయ్య బాబు.. రెండు రోజుల పాటు.. సైకిల్ రావాలి పేరుతో క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి జిల్లాలో బాలయ్య పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజుత తన ఇష్టదైవమైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను దర్శించుకొనుని ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. కదిరిలో ఈరోజు సాయంత్రం కదిరి జీవిమాలో బహింరంగ సభలో ప్రసంగించనున్నట్లు కూడా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు గాను షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ మరోసారి తమకు పట్టం కట్టాలని సీఎం జగన్ సిద్ధంపేరిట సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలోస్పీడ్ ను పెంచింది. ఇక బీజేపీ, జనసేన, టీడీపీలు కూటమిగా ఏర్పడి తమకు ప్రజలు పట్టం కట్టాలని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter