Vizag Shipyard jobs: విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు పడ్డాయి. త్వర పడండి. పర్మినెంట్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు హిందూస్తాన్ షిప్‌యార్డ్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విశాఖపట్నం ( Visakhapatnam ) హిందూస్తాన్ షిప్‌యార్డ్ ( Hindustan shipyard ) నుంచి ఓ శుభవార్త. చాలాకాలం తరువాత ఈ సంస్థ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. పర్మినెంట్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ( Shipyard jobs ) భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూస్తాన్ షిప్ యార్డులో మొత్తం 26 ఖాళీలున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో శాశ్వత ప్రాతిపదికన 9, కాంట్రాక్ట్ బేస్‌లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్మినెంట్ పోస్టుల్లో జనరల్ మేనేజర్-2, అడిషనల్ జనరల్ మేనేజర్ ( HR ) -1,  మేనేజర్-6 ( కమర్షియల్ 2, టెక్నికల్ 4 ) పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ పోస్ట్ విభాగంలో డిప్యూటీ మేనేజర్-1, మేనేజర్లు 2, అసిస్టెంట్ మేనేజర్లు 8, జూనియర్ మేనేజర్ 1,మెడికల్ ఆఫీసర్లు 2, సీనియర్ కన్సల్టెంట్ 3 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు జనవరి 8 లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తుల హార్డ్ కాపీలు జనవరి 16లోగా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. 


మేనేజర్ పోస్టులో కమర్షియల్ విభాగంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీతో పాటు ఎంఎంఎస్/ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక టెక్నికల్ విభాగం కోసం బీటెక్ చేసి ఉండాలి.  పీజి డిప్లొమా వారికి ప్రాధాన్యత ఉంటుంది.  ఐటీ విభాగానికి కావల్సిన విద్యార్హత ఎంసీఏ, బీటెక్ లేదా బీఈ చేసుండాలి. అభ్యర్ధులకు కనీసం 9 ఏళ్లు అనుభవం పొంది ఉండాలి. 40 ఏళ్ల లోపు వయస్సుండాలి.  


అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయస్సు 35 మించకూడదు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్ ( Online applications ) ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


Also read: Bank jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంక్ ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..