TVS Showroom Fire Accident: గురువారం తెల్లవారు జామున విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా కేపీ నగర్ లోని టీవీఎస్ ద్విచక్ర వాహనాల షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీఎస్ షోరూంలోని వాహనాలతో పాటు గోదాంలో దాగిఉన్న దాదాపు 300కి పైగా బైకులు మంటల్లో దగ్ధమయ్యాయని యజమాని తెలియజేశారు. వీటిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్లవారుజామున ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మూడు ఫైరింజన్లు వచ్చి కొన్ని గంటల పాటు శ్రమించి అగ్నిజ్వాలలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. 


అసలేం జరిగిదంటే?
విజయవాడలోని నేషనల్ హైవే (చెన్నై to కోల్‌కతా) పై స్టెల్లా కాలేజీ సమీపంలోని టీవీఎస్ బైక్ షోరూం ఉంది. గురువారం తెల్లవారు జామున షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు చెలరేగాయి. సెకన్ల వ్యవధిలోనే మంటలు బైకుల గోదాంకూ చేరుకున్నాయి. అది గమనించిన సెక్యూరిటీ అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. 


ఆ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు, భారీ అగ్నిజ్వాలలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ బైక్ షోరూం ప్రీ - ఫ్యాబ్రిక్ మోడల్ లో నిర్మించిన కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు గోదాంలో ఉండడం కారణంగా మంటలు మరింతగా ఎగసిపడ్డాయని అధికారులు స్పష్టం చేశారు.


ప్రమాదం తర్వాత టీవీఎస్ షోరూం చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మామూలుగా పెట్రోల్ బైకులతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లోని బ్యాటరీల కారణంగా, వాటిని ఛార్జింగ్ పెట్టే ప్రదేశంలో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  


అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇతర టీవీఎస్ డిస్ట్రిబ్యూటర్లకు ఇదే ప్రధాన కార్యాలయం. ఈ క్రమంలో జిల్లాలలోని మొత్తం సెంటర్లకు సంబంధించిన వాహనాలకు ఇక్కడే నిర్వహిస్తారు. అంతే కాకుండా ఒకే ప్రాంగణంలో షోరూం, సర్వీస్ సెంటర్, గోదాం ఇక్కడే ఉండడం వల్ల రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి