Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది
Hyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు
Hyper Aadi: సినీనటుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కమెడియన్ హైపర్ ఆది వాడేసుకుంటున్నాడు. ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా పని చేసిన ఆది ఇప్పుడు తన అభిమాన హీరో ఉప ముఖ్యమంత్రి కావడంతో పరమానందంలో ఉన్నాడు. తన దేవుడిగా భావించే పేరును ప్రస్తావిస్తున్నాడు. రాజకీయ కార్యక్రమాల్లోనే కాదు తన కామెడీ షోల్లోనూ కూడా ఆది పవన్ పేరును వాడుతున్నాడు.
Also Read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో హైదరాబాద్‌లో ఆదివారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొని ఆది మాట్లాడాడు 'నేను ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి తాలుకా' అని ప్రకటించాడు. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడడంతో అందుకే ఈ విజయోత్సవ వేడుక అని తెలిపాడు. 'పవన్ గెలిచినప్పుడు ప్రతి జనసైనికుడి కళ్లల్లో ఆనందం చూశాను. విజయం తర్వాత పవన్ వెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరించడం నన్ను భావోద్వేగానికి గురి చేసింది' అని తెలిపాడు. ఇక ఐదేళ్ల పాటు తమకు కష్టాలు ఉండవని చెప్పాడు.
Also Read: Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్.. రోజా అవినీతిని కక్కిస్తాం
ఇక హైపర్ ఆది ఈటీవీ షో అయిన ఢీలో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ షోలో కూడా ఆది పవన్ కల్యాణ్ పేరును వాడేసుకుంటున్నాడు. తాజాగా విడుదలైన ప్రొమోలో ఆది తోటి నటీనటులకు 'తెలుసు కదా నేను ఎవరో తాలుకో. పిఠాపురం తాలుకా' అని హైపర్ ఆది భయపెట్టించాడు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలుపు కోసం హైపర్ ఆది పని చేశాడు. ఎన్నికల సమయం మొత్తం ఆ నియోజకవర్గంలోనే ఉన్నాడు. తనతోపాటు తోటి నటీనటులను కూడా పవన్‌కు మద్దతుగా ప్రచారం చేయించాడు. అక్కడ పవన్ విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి కావడంతో ఇక హైపర్ ఆదికి అడ్డూఅదుపే లేకుండాపోయింది. త్వరలోనే ఆదికి ఏపీ ప్రభుత్వంలో ఒక పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter