AP-TG Rain Alert: ఏపీ, తెలంగాణల్లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Imd weather update: రానున్న మూడు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా, పలు హెచ్చరికలను జారీ చేసింది.
Imd rainfall alert in Andhra Pradesh and Telangana: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో.. రాగల మూడు రోజులపాటు వర్షాలపై హైదరాబాద్ వాతావరణం కేంద్రం రైన్ అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా.. నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఇది.. ఈరోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని వున్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి. మీ. మధ్యలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు.. 18 డిగ్రీల ఉత్తర అక్షంశం గుండా సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కి. మీ. మధ్యలో కొనసాగుతున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు రుతుపవనాలు కూడా తెలుగు స్టేట్స్ లలో జోరుగా విస్తరించాయి.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో తెలిక పాటి వర్షాలతో పాటు, మరికొన్ని ప్రాంతాలలో సాధారణం నుంచి భారీగా వర్షపాతం నమోదవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వర్షంతో పాటు బలమైన గాలుల ప్రభావం కూడా ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా పలు ప్రాంతాలలో.. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులు వీస్తాయని సమాచారం.
దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాలలో పలు చోట్ల భారీగానే వర్షం కురిసిందని చెప్పుకొవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రుతుపవనాలు జోరుగా విస్తరించాయని చెప్పుకొవచ్చు. జూన్ మాసంలో మధ్యస్థంగా వర్షంకురిసిందని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం వర్షం కురిసింది. ఆతర్వాత వరుణుడు మరల ముఖం చాటేశాడు.
కానీ ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల ఉక్కపోతగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడి, గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో మరల తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షంకురుస్తుందని తెలుస్తోంది. మరోవైపు వర్షం పడుతుందంటే హైదరాబాద్ జనాలు విలవిల్లాడిపోతారు.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
సాయంత్రంపూట ఆఫీసులు, స్కూళ్లనుంచి బైటకు వచ్చే సమయంలో వర్షం పడితే ఇక అంతే సంగతిగా భావిస్తారు. ఒక వైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి. రోడ్లని నడుము నీటితో నిండి ఉంటాయి. మరోవైపు వర్షం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా వర్షం నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి