Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ నాలుగురోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకోనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం పడనుంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకోనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం పడనుంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
తమిళనాడును(Tamilnadu)ముంచెత్తుతున్న వర్షాలు ఏపీపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal), దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి ఇవాళ అల్పపీడనంగా మారనుంది. చెన్నైకు 4 వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి..పశ్చిమ వాయువ్యదిశగా కదలనుంది. అలా కదులుతూ ఈ నెల 11వ తేదీకు ఉత్తర తమిళనాడు తీరానికి చేరనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా దక్షిణ కోస్తా(South Coastal), తమిళనాడులపై నాలుగు రోజులపాటు తీవ్ర ప్రభావం ఉండనుంది.
నవంబర్ 10, 11 తేదీల్లో తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తురు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తాయని ఐఎండీ(IMD) తెలిపింది. మరోవైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడన ప్రభావం, వాతావరణంలో మార్పులతో విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత మూడ్రోజులుగా చలిగాలులు అధికమయ్యాయి. విశాఖ ఏజెన్సీలో సాయంత్రం 5 గంటల్నించే చలిగాలులు మొదలవుతున్నాయి.
Also read: Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook