AP Heavy Rains: దక్షిణ ఒడిశాలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే దక్షిణ ఛత్తీస్‌గడ్ వైపు కదులుతోంది. మరోవైపు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. జూలై 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దాంతో ఏపీ అంతా రానున్న 5-6 రోజులు విస్తారంగానూ, భారీ వర్షాలు నమోదుకానున్నాయని వాతావరణ శాఖ సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లా మెరకముడిదంలో 3.3 సెంటీమీటర్లు, గజపతినగరం మండలం ముచ్చర్లలో 2.8 సెంటీమీర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కృష్ణా జిల్లా నాగాయలంకలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్లు, కృత్తివెన్నులో 6.6 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 


ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు, అల్పపీడనం కారణంగా రానున్న 5 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఐఎండీ అంచనా ప్రకారం ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడితే ఇక భారీ వర్షాలు ప్రారంభం కానున్నాయి. 


ఇవాళ జూలై 17న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, విజయనగరం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.


ఇక జూలై 18న అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటు విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


జూలై 19వ తేదీ శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముంది. ఇక విశాఖపట్నం, కృష్ణా, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, కర్నూరుల, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


Also read: 8th Pay Commisson: ఉద్యోగుల పంట పండినట్టే, 8 వేతన సంఘం, కోవిడ్ బకాయిలపై బడ్జెట్‌లో ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook