Weather updates: హైద‌రా‌బాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఛత్తీ‌స్‌‌గఢ్‌ నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు తెలం‌గాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్ప‌పీ‌డన ద్రోణి కొన‌సా‌గు‌తోంది. దీని ప్రభా‌వంతో ఇరు రాష్ట్రాల్లో నైరుతి రుతు‌ప‌వ‌నాలు చురుగ్గా కదు‌లు‌తు‌న్నాయని హైదరాబాద్ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. Also read: YS Jagan: ఆ మహిళలకు రూ.5 వేలు సాయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. తెలంగాణ ( Telangana ) లో అదే విధంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముసురు పట్టింది. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది. అయితే.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు. Also read: Andhra Pradesh: భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం


సముద్రంలోకి వెళ్లే మత్స్య కారులు కూడా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.  లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతోంది. Also read: IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?