Heat Waves in Telugu States: ఠారెత్తనున్న ఎండలు.. రానున్న 5 రోజుల్లో తీవ్ర వడగాల్పుల.. హెచ్చరిక జారీ చేసిన IMD
Summer Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరిగాయి. రానున్న ఐదారు రోజులు మరింత పెరగవచ్చనే హెచ్చరికలున్నాయి. నిన్న, ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert in Telugu States: వేసవికాలం తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే కాకుండా వడగాల్పుల తీవ్రత అధికమైంది. రానున్న రెండ్రోజుల్లో ఏపీలో వడగాల్పుల తీవ్రత పెరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. వడగాల్పుల తీవ్రత పెరగనున్న నేపధ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే సూచనలు జారీ అయ్యాయి.
గత 3-4 రోజుల్నించి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రానున్న 5-6 రోజులు ఎండల తీవ్రత మరింత పెరగనుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి ఎండలు ఠారెత్తనున్నాయనే సూచనలున్నాయి. ప్రతిరోజూ కనీసం 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగవచ్చని అంచనా. ఇప్పటికే అంటే నిన్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా రెంటచింతలలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజమండ్రిలో 41 డిగ్రీలు నమోదైంది. ఇక కర్నూలులో 39 డిగ్రీలు, విజయవాడలో 38, ఏలూరులో 38, నంద్యాలలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ అదిలాబాద్‌లో అత్యధికంగా 37.8 డిగ్రీలు నమోదు కాగా రామగుండంలో 34 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35.7 డిగ్రీలు నమోదైంది.
ఏప్రిల్ నుంచి క్రమంగా మే నెల వచ్చేసరికి ఎండలు పీక్స్‌కు చేరతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాల్పుల నేపధ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోని 6 జిల్లాలకు వడగాల్పుల అలర్ట్ జారీ అయింది. ఇందులో అల్లూరి సీతారామరాజు మన్యం, కాకినాడ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పరిధిలోని చింతూరులో అత్యధికంగా 44.7 డిగ్రీలు, నెల్లిపాకలో 43.1 డిగ్రీలు నమోదు కావచ్చని అంచనా. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook