Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ నెలలో ఏపీ, తెలంగాణల్లో భారీగానే వర్షాలు(Heavy Rains)నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. అటు హైదారాబాద్ ఇటు విశాఖపట్నం వాతావరణ కేంద్రాలు రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ వర్షాలకు అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. అటు హైదరాబాద్‌లో కూడా మరోసారి కుంభవృష్టి తప్పేట్టు లేదు. 


బంగాళాఖాతంలో(Bay of Bengal)మరో అల్పపీడనం ఏర్పడటమే వాతావరణ మార్పులకు కారణంగా తెలుస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా ఏపీ వ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలో.. తెలంగాణలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


Also read: Tamilnadu: ఏఐఏడీఎంకేలో వర్గపోరు, చిన్నమ్మ జపం ప్రారంభించిన పన్నీర్ సెల్వమ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook