Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 11 నుంచి భారీ వర్షాలు
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 11వ తేదీన అల్పపీడనం (Low Pressure) ఏర్పడవచ్చని ఐఎండీ సూచించింది. ఫలితంగా వచ్చే మూడ్రోజుల్లో ఏపీలో వర్షాలు పడవచ్చు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు కూడా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్‌లో భారీ వర్ఖం నమోదైంది. అటు ఉమ్మడి వరంగల్, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు(North Eastern Monsoon) రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడనున్న అల్పపీడనంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13 వరకూ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD)హెచ్చరించింది. ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా పడవచ్చని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని సమాచారం.
Also read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలకమైన ఉన్నత స్థాయి భేటీ