ఆంధ్రప్రదేశ్ విజయవాడ విమానాశ్రయం కనెక్టివిటీ పెంచుకుంటోంది. నూతన సంవత్సరం నుంచి ముంబై విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ( AP ) లో విశాఖపట్నం ( Visakhapatnam ) తరువాత పెద్ద విమానాశ్రయం విజయవాడ ( Vijayawada Airport ). రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ విమానాశ్రయానికి రద్దీ పెరిగింది. రద్దీతో పాటు విమాన సర్వీసులు కూడా పెరిగాయి. దేశంలోని చాలా నగరాలతో కనెక్టివిటీ ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ముంబైకు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.


నూతన సంవత్సరంలో అంటే జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై విమాన ( Vijayawada-mumbai flights ) సర్వీసుల్ని ఇండిగో సంస్థ ( Indigo Airlines ) ప్రారంభిస్తోంది. వాస్తవానికి ఇండిగో గతంలోనే విజయవాడ-ముంబై విమాన సర్వీసులు నడిపినా..కోవిడ్ నేపధ్యంలో నిలిచిపోయాయి. దాంతో ముంబైకు వెళ్లాలనుకునే ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ( Airport Authority ) కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. వారానికి మూడ్రోజుల పాటు అంటే మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముంబై నుంచి ఉదయం 10.50 కు బయలుదేరి..మధ్యాహ్నం 12.45కు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి మద్యాహ్నం 1.30కు బయలుదేరి..3.20కు ముంబై చేరుకుంటుంది. 


Also read: New coronavirus strain: ఏపీలో రాజమండ్రి మహిళకు కొత్త కరోనా వైరస్ నిర్ధారణ