AP Government: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పుడు మరో విచారణ జరగనుంది. ప్రభుత్వంతో పాటు సీనియర్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్రమశిక్షణ చర్యలకు దిగుతోంది. విచారణకు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం(Telugudesam) ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే దేశభద్రత, సమగ్రతకు భంగం కలిగేలా, రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు.దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం, ఇతర సీనియర్ అధికారులపై ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం మరో విచారణకు ఆదేశాలిచ్చింది. ఆలిండియా సర్వీస్ క్రమశిక్షణ, నిబంధలు 1969 రూల్ నెంబర్ 8 ప్రకారం విచారణకు ఆదేశాలిచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das)ఉత్తర్వులు జారీ చేశారు. 


విచారణ బాథ్యతల్ని ఆర్పీ సిసోడియాకు అప్పగించారు. ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా న్యాయవాది సర్వ శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు. ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు ఫోర్జరీ పత్రాల్ని పెట్టిందనే ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అటు ఏబీ సమర్పించిన పత్రాలపై ప్రభుత్వానికి అనుమానముంది. మీడియాకు ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswararao) ఇచ్చిన లీకులు, పత్రాలు కూడా తప్పుడివేనని నిర్ధారించింది. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. 


Also read: Ap government: టీచర్ల సీనియారిటీ జాబితాకు మరింత గడువు పెంచిన ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook