Ap government: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల సీనియారిటీ జాబితా సిద్ధమవుతోంది. న్యాయపరమైన వివాదాల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందరికీ అవకాశం కల్పించేందుకు మరింత గడువు కల్పించారు.
ఏపీలో టీచర్ల బదిలీలు త్వరలో జరగనున్నాయి. ఇందులో భాగంగా టీచర్ల సీనియారిటీ పరిగణలో తీసుకుంటారు. అందుకే టీచర్ల సీనియారిటీ జాబితా(Ap teachers transfers) సిద్ధమవుతోంది. ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు, ఉపాధ్యాయ బదిలీల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టీచర్ల జాబితా రూపకల్పనకు మరింత గడువు పెంచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేసి ఆగస్టు 1 నాటికి వెబ్సైట్లో ప్రదర్శించాలి. ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని గడువు పొడిగిస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. మరో 18 రోజులు గడువు పొడిగించారు.
ఆగస్టు 10 వతేదీ నాటికి ఉపాధ్యాయుల సీనియారిటీ వివరాలు సేకరించి..ఆగస్టు 18 నాటికి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను వెబ్సైట్(Teachers)లో ఉంచాలి. ఆగస్టు 31 నాటికి జాబితాపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేయవచు. సెప్టెంబర్ 12 నాటికి అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం ఉంటుంది. సెప్టెంబర్ 15 నాటికి అన్ని క్యాడర్ల తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు.
Also read: Covid Vaccination: ఏపీలో వేగవంతమవుతున్న కరోనా వ్యాక్సినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook