Pandem Kollu: సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా ముగ్గులు, గొబ్బిళ్లు ఎలాగో..పందెం కోళ్లు కూడా అంతే. పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కొక్క కోడి పుంజు ధర చూస్తే ఆశ్చర్యపోతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లోనే చూడాలి. ఓ వైపు సాంప్రదాయ ముగ్గులు, గొబ్బెమ్మలు, బోగిమంటలు, బోగిపళ్లు..మరోవైపు గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో ముఖ్యంగా సంక్రాంతి శోభ అంతా గోదావరి పల్లెల్లో కన్పిస్తుంటుంది. మరోవైపు సంక్రాంతి (Sankranthi) మూడ్రోజులు ప్రతి పల్లెలో కోడిపందేలు తప్పనిసరిగా దర్శనమిస్తాయి. సంక్రాంతి కోడి పందేలకు సిద్ధం చేసే కోడి పుంజులు చాలా విభిన్నంగా ఉండటమే కాకుండా..చాలా ఖరీదు కూడా. కోడి పంజుల్లో రకాన్ని బట్టి అంటే జాతిని బట్టి ధర ఉంటుంది. 


సంక్రాంతి కోడి పందేల (Pandem Kollu) బరిలో నిలిచే కోళ్ల ధర ఒక్కొక్కటి పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుంది. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమై ఉంటాయి. ఈ కోడి పుంజుల ధర 70 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. అత్యంత ఖరీదుగా ఉండేవి సేతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి.


ముఖ్యంగా పర్ల జాతి 50 వేలు పలికితే..నెమలి రకం 50-60 వేల వరకూ ఉంటుంది. ఇక కాకి డేగ 25 వేల నుంచి 30 వేలు పలుకుతుంది. కెక్కిరాయి అయితే 40 వేల వరకూ ఉంటుంది. పచ్చకాకి రకం 30-40 వేలుంటుంది. ఇలా కోడి పుంజు జాతిని బట్టి ధర ఉంటుంది. కోడి పందేలకు పుంజుల్ని సిద్ధం చేసేందుకు దాదాపు ఆరు నెలల కఠోర శిక్షణ , పెంపకం ఉంటాయి.


Also read: ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook